13 May, 2026 | 11:13 AM

వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం

28-08-2024 11:30 AM

రాజన్నసిరిసిల్ల: మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్నను బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈవో మంత్రి పొన్నంకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఆలయంలో కోడె మొక్కలు చెల్లించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రాజన్న స్వామివారిని దర్శించుకున్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం మంత్రి పొన్నంని ఆల‌య మ‌ర్యాదాల‌తో స‌న్మానం చేశారు. అర్చ‌కులు స్వామివారి తీర్థ ప్ర‌సాదంతో పాటు వేద ఆశీర్వదచనలు అందజేశారు.