15-01-2026 12:15:14 AM
హనుమకొండ,జనవరి 14 (విజయక్రాంతి): తాళం వేసి ఉన్న ఇండ్లలో పట్ట పగలు దొంగ తనాలు చేసే పశ్చిమ బెంగాల్ కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను కేయుసి, సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 10వ తారీఖు ఉదయం10.30 గంటల సమయం లో గోపాలపురం పరిధిలోని శివ సాయి కాలనీలో తాళం పగలగొట్టి ఇంట్లోని బీరువా లో గల సుమారు 15 తులాల బం గారు ఆభరణాలు, ఐదు తులాల వెండి, నగ దు దొంగతనం జరిగినట్టు కేయూ పోలీస్ స్టే షన్లో ఫిర్యాదు నమోదు అయింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత పర్యవేక్షణలో అడిషనల్ క్రైమ్ డీసిపి బాలస్వామీ, క్రైమ్ ఏసిపి. సదయ్య, హన్మకొండ, ఏ సి పి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో నేరస్థుల యొక్క వివరాలు సేకరించి వారి యొక్క ఆచూకీ కోసం ఆరా తీస్తున్న క్రమంలో నిందితులు మళ్ళీ దొంగతనాలు చేయడానికి కే యూ సి జంక్షన్ దగ్గర కు వచ్చి ఉన్నారనే పక్క సమాచారం మేరకు కేయూసీ, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా కే యూసి జంక్షన్ వద్ద వాహనాలు తనికి చేస్తుండగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులు ఫెరోజ్ షేక్, సుక్ చంద్, యామీన్ పోలీసులను చూసి పారిపోతున్న క్రమంలో వారిని పట్టుకొని విచారించగా వారు చేసిన దొంగతనాల గురించి ఒప్పుకొనగా వారి నుండి సు మారు 15 తులాల బంగారు నగలను, 5 తులాల వెండి నగలను మరియు నిందితులకు సంబందించిన రెండు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగినదని తెలిపారు.
మరో నిం దితుడు ఫెరోజ్ షేక్ పరారీలో ఉన్నాడని, నిందితులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారని అన్నారు. దొంగతనాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ కే. రామకృష్ణ, కేయూసీ ఇన్స్పెక్టర్ ఎస్. రవి కుమార్, సల్మాన్ పాషా, రాజ్ కుమార్, సాయి ప్రసన్న కుమార్, శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుల్లు మహేశ్వర్, జంప య్య, మధుకర్,చంద్రశేఖర్, రాములు, ఉపేందర్, వంశీ,విశ్వేశ్వర్, వినోద్ లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.