15-01-2026 12:13:51 AM
డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు డాక్టర్ రామచంద్రనాయక్
మరిపెడ ,జనవరి 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం ఎంపీడీవో ఆవరణంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయుడు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను వీక్షించిన అనంతరం భోగి మండలం వెలిగించారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో బోగభాగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా ఉం డాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీపాల్ రెడ్డి, మరిపెడ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్, రంలాల్, అంబరీష, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.