5 June, 2026 | 3:23 PM

Breaking News

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్   •   శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో టీటీడీ వారిచే కుంకుమ పూజలు   •   అక్రమ కేసులకు వ్యతిరేకంగా బిజినేపల్లి ఠాణా ముట్టడి   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పంచాయతీలో అవగాహన సదస్సు   •   కేఓసీలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం   •   నూతన మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల   •   అమీర్‌పేట అగ్నిప్రమాదం: బాధితులను పరామర్శించిన కవిత   •   కదులుతున్న రైలుపై రాళ్ల దాడి.. లోకో పైలట్‌కు తీవ్రగాయాలు   •   ఉపాధి హామీ కూలీలకు రూ.800 కూలి ఇవ్వాలి   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •  

శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో టీటీడీ వారిచే కుంకుమ పూజలు

05-06-2026 02:51 PM

సుల్తానాబాద్, జూన్ 05 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శ్రీ కన్యకా పరమేశ్వరి (వాసవి మాత) ఆలయంలో ఈనెల 2 నుంచి 6 వరకు జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం స్థానిక మహిళలచే లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

పెద్దపల్లి జిల్లా ధర్మాచార్యులు మెంగని చంద్రశేఖర్ , ఎల్లంకి వైకుంఠం, ఈ రామ్మోహన్ రావు లు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల లో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు అయినా మారుమూల గ్రామాలలో ఉన్న ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో ధర్మ ప్రచార పరిషత్ ను ఏర్పాటు చేసి ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్లు ,ధర్మాచార్యులు ద్వారా పలు గ్రామాలలోని పలు దేవాలయాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ నెల రెండు నుండి ఆరు వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని  స్థానిక మహిళలు చే కన్యకా పరమేశ్వరి ఆలయ పూజారి వల్ల కొండ మఠం మహేష్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు , అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేసినారు , ఇందులో వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్,  పల్లకిషన్ తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు,   శనివారం నగర సంకీర్తనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.