లేబర్ కోడ్లను రద్దు చేయాలి
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 1 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.ఆదివారం తిర్యాని మండల కేంద్రంలోని భావన నిర్మాణ కార్మిక సంఘం సమావేశాన్ని కొమురం భీం కమ్యూనిటీ హాల్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారికి 5000 రూపాయల పెన్షన్ చెల్లించాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.పిల్లల పెళ్లిలకు రెండు లక్షలు,మెటర్నటీ కి లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు ప్రమాదం లో మరణిస్తే 25 లక్షల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
పాత పద్ధతిలోనే క్లైమ్స్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నా యని ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మికుల చట్టాల నుంచి 29 కార్మిక చట్టాలను విడదీసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపో తున్నారని. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు జంగు, మొగిలి, వెంకన్న, సంతోష్, రవి, భీమ్రావు, లక్ష్మణ్ తదితరులున్నారు.






