11-07-2024 12:01:14 AM
మరొకరికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి, జూలై 10 (విజయక్రాంతి): షాద్‌నగర్ నియోజకవర్గ పరి ధి నందిగామ మండలంలోని మేకగూడ గ్రామ సమీపంలో ఉన్న నాట్కో పరిశ్రమలో పనిచేస్తున్న పెంజర్ల గ్రామానికి చెందిన రవిచంద్ర (19) అనే కార్మికుడు బుధవారం ప్రమాదవశాత్తు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పెంజర్లకు చెందిన వీర్లపల్లి రవిచంద్ర, మహేశ్ అనే ఇద్దరు కొంత కాలంగా నాట్కో ఫార్మా ల్యాబ్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బుధవారం విధుల్లోకి వెళ్లిన ఇద్దరు హైడ్రాలిక్‌ను క్లీన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హైడ్రాలిక్ మెషిన్ మీద పడి రవిచంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంలో మహేశ్ తీవ్రంగా గాయాపడ్డా డు. కంపెనీ యాజమాన్యం మహేశ్‌ను హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద విషయంపై ఆరా తీశారు. మృతుడి తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.