అంగన్వాడి కేంద్రాలలో బాలమేళా
10-03-2026 09:56 PM
కొండపాక: కొండపాక మండలం దుద్దెడ అంగన్వాడి కేంద్రాలలో మంగళవారం బాలమేల కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇందిరా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ పిల్లలకు నిబంధ విద్య కాకుండా ఆటపాటలతో, కథల ద్వారా సృజనాత్మక కార్యక్రమాల ద్వారా సెంటర్లలో చేసి చూపిస్తామని తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించారు. ఈ విధంగా శారీరక మానసిక భావోద్వేగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమన్ని రిలయన్స్ అండ్ క్రయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇందిరా, అంగన్వాడీ టీచర్స్, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




