అధికారుల సమన్వయ లోపంతో ప్రజలకు తప్పని ఇబ్బందులు
కూకట్‌పల్లి, ఆగస్టు 4 (విజయక్రాంతి): అధికారుల సమన్వయ లోపంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నా రు. కూకట్ పల్లి నియోజకవర్గ పరిధి అల్లాపూర్ డివిజన్ లో మంగళవారం బండి రమే ష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించినప్పుడు ఉన్న సమస్యలే ఇప్పటికీ అలానే ఉన్నాయని సమస్యలను పరిష్కరించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డివిజన్ లో రోడ్లు అద్వాన్నంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్ పరిధిలోని ఈ బ్లాక్ లో రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. సిఎంసి, వాటర్ వరక్స్ అధికారుల సమన్వయ లోప ంతోనే పనులు నిలిచిపోయాయన్నారు. మ ంజీరా పైప్ లైన్ వరక్స్ సాకుగా చూపి రోడ్డు పనులను నిలిపివేయడం సరికాదన్నారు. వాటర్ వరక్స్ అధికారులతో సమన్వయం చేసుకొని రోడ్ల సమస్యను పరిష్కరించాలని సిఎంసి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వాజిద్ పాషా, లక్ష్మణ్ గౌడ్, అబ్దుల్లా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.






