2 July, 2026 | 2:59 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

రాష్ట్రంలో 24 లక్షల సభ్యత్వాలు నమోదు

23-10-2024 02:33 AM

బీజేపీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి రాంచందర్‌రావు 

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇప్పటివరకు 24 లక్షల వరకు బీజేపీ సభ్యత్వాల నమోదు జరిగిన ట్లు పార్టీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి ఎన్. రాంచందర్ రావు తెలిపారు. మిస్డ్ కాల్ ద్వారా సుమారు 4 లక్షల వరకు, ఆన్‌లైన్ ద్వారా 20 లక్షల వరకు మెంబర్‌షిప్ జరిగిందన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

బీజేపీ సంఘటన్ పర్వ్‌కు జాతీయస్థాయి రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఎంపీ డా.లక్ష్మణ్‌ను నియమించారని తెలిపారు. అక్టోబరు 30 వరకు మెంబర్ షిప్  కార్యక్రమాన్ని పొడిగించినట్లు వెల్లడించారు. 8800002024 నెంబర్‌కు మిస్ట్ కాల్ ఇచ్చి సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాధవి, మధు సూదన్ రెడ్డి,   తదితరులు పాల్గొన్నారు.