9 April, 2026 | 2:42 AM

నేడే పోలింగ్

09-04-2026 12:34 AM

కేరళంలో 140, అసోంలో 128, పుదుచ్చేరిలో 30 స్థానాలు

గువాహటి/ తిరువనంతపురం/ పుదుచ్చేరి, ఏప్రిల్ 8: అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అసోంలోని 128 స్థానాలకు 722 మంది, కేరళలోని 140 స్థానాలకు 883 మంది, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

మొత్తం 298 అసెంబ్లీ స్థానాలకు గాను 1,899 మంది అభ్యర్థుల భవితవ్యం పోలింగ్‌తో తేలనుంది. అసోంలో బీజేపీ హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉండగా, కాంగ్రెస్ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీయే కూటముల మధ్య త్రిముఖ పోరు సాగుతోంది. పుదుచ్చేరిలో ఎన్డీయే, డీఎంకే, టీవీకే కూటములు తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి. గోవాలోని పోండా అసెంబ్లీ స్థానానికి జరగాల్సిన ఉపఎన్నికను బాంబే హైకోర్టు  రద్దు చేసింది.