లక్ష్మీకాలనీ సమస్యలు పరిష్కరించాలి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
అత్తాపూర్ లక్ష్మీకాలనీ సమస్యలు యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కమిషనర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జోనల్ కమిషనర్ వెంకన్నతో కలిసి లక్ష్మీనగర్‌కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతిని ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కమిషనర్‌ను కోరారు.
కాలనీలో ముఖ్యంగా దోమల సమస్య, మెయిన్ రోడ్డు నుంచి కాలనీ వరకు రోడ్డు వెడల్పు, కాలనీ చుట్టూ ఉన్న మూసి పరివాహక స్థలంలో ప్రైవేటు వ్యక్తులు భవన నిర్మాణ వ్యర్థాలు డంపు చేస్తున్నారని ఆర్‌డబ్ల్యూఎస్ ప్రతినిధులు కమిషనర్‌కు వివరించారు. అక్కడున్న జోనల్, డిప్యూటీ కమిషనర్‌లను ఆదేశిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వీధి దీపాల సమస్య త్వరలో తీర్చడానికి చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ వివరించారు. సింగిల్ ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని కమిషనర్ కోరారు. అందుకు వీధి వ్యాపారులు షాపు యజమానులు సింగిల్ ప్లాస్టిక్ వాడకం పై కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండి నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఆర్ డబ్లు ఏ సభ్యులు కూడా పర్యవేక్షణ చేయాలన్నారు.
ముఖ్యంగా మూసి రివర్ బెడ్ లో రాత్రి సమయంలో భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త, ఆహార వ్యర్థాలు అక్రమంగా డంప్ చేస్తున్నారని వాటిని నియంత్రణ చేయకపోతే వర్షా కాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కమిషనర్ ను కాలనీ ప్రతినిధులు కోరారు. కమిషనర్ వెంట జోనల్ కమీషనర్ వెంకన్న, డిప్యూటీ కమీషనర్ రవి కుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో లైట్ హౌస్ ఫౌండేషన్ చైర్మన్ సమావేశం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 10: హైదరాబాద్‌లోని అన్ని జోన్లలో లైట్‌హైస్ నైపుణ్య అభివృద్ధి కేంద్రాల విస్తరణపై చర్చించడానికి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గణేష్ నటరాజన్, తెలంగాణ రాష్ట్ర అధిపతి ఆకుల శ్రీనివాస్, మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిరుపేద యువతకు జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ సహకారాన్ని బలోపేతం చేయడం, నైపుణ్య అభివృద్ధి కెరీర్-సంసిద్ధత కార్యక్రమాల గురించి చర్చించారు.






