28 June, 2026 | 2:02 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

11-06-2025 01:15 AM

వెల్దుర్తి, జూన్ 10: అప్పల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని ఎలుకపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన మంద స్వామి(40) అనే రైతు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో స్వామికి అప్పల భారం పెరిగిపోవడం, కుటుంబ పోషణ గడవకపోవడంతో ఇబ్బంది పడినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన స్వామి గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.