01-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 30: లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైం ది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లలిత్ మోదీకి ఈడీ రూ.10.65 కోట్ల జరిమానా విధిం చడాన్ని సవాల్ చేస్తూ ఆ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది.
అయితే చట్ట ప్రకారం తనను తాను రక్షించుకునే హక్కు మోదీకి ఉందని జస్టిస్ పీఎస్ నరసింహ.. ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొం ది. ఫెమాను ఉల్లఘించినందుకు ఈడీ తనపై విధించిన రూ.1౦.65 కోట్ల జరిమానాను చెల్లించేలా బీసీసీఐని ఆదేశించాలని కోరుతూ లలిత్ గతేడాది డిసెంబర్‌లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు.