01-07-2025 12:00:00 AM
ఏడుగురు ఇంజినీర్ల సస్పెన్షన్
భోపాల్, జూన్ 30: మధ్యప్రదేశ్‌లో తాజాగా నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 90 డిగ్రీల మలుపుతో ఈ వంతెనను నిర్మించగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ వంతెన నిర్మించిన అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది.
మరో విశ్రాంత ఇంజినీర్‌పై కూడా శాఖాపర విచారణకు ఆదేశించింది. ‘ఐష్‌బాగ్‌లో ఆర్‌వోబీ నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించా. నివేదిక ఆధారంగా ఎనిమిది మంది పీడబ్ల్యూడీ ఇంజినీర్లపై చర్యలు తీసుకు న్నా. ఇందులో ఏడుగురు ఇంజినీర్లపై తక్షణమే సస్పెండ్ చేస్తున్నా.
నిర్మాణ ఏజెన్సీ, డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్‌లను బ్లాక్‌లిస్ట్‌లో చే ర్చాం. ఆర్వోబీ పునరుద్ధరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశాం’ అని మధ్యప్రదేశ్ సీఎం మోహ న్ యాదవ్ వెల్లడించారు. ఐష్‌బాగ్ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే, అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది.