calender_icon.png 1 July, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8లోపు వాణిజ్య ఒప్పందం

01-07-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జూన్ 30: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పం దం తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. జూలై 8 లోపు ఎ ప్పుడైనా దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్ తరఫున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఈ ఒప్పందంపై తుది విడత చర్చలు జరిపేందుకు ఇప్పటికే వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ట్రంప్ కొత్తగా విధించిన సుంకాలు జూలై 9వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

సుంకాల గడువును మరోసారి పొడిగించే ఉద్దేశం లేదని ట్రంప్ మీడియాకు తెలిపారు. ఏప్రిల్‌లో ట్రంప్ భారత్‌పై 26శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆ సుంకాలను జూలై 9 వరకు నిలుపుదల చేస్తూ తర్వాత ప్రకటించారు. ట్రంప్ విధించిన గడువుకంటే ముందే నూతన వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది.