calender_icon.png 1 July, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 1న లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం..

30-06-2025 08:45:39 PM

భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ కుశ నాయక్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జులై 1 మంగళవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని చిల్డ్రన్స్ పార్క్ లో ఆవిర్భావ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుశ నాయక్(District Chief Secretary Kusha Naik) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ హాజరవుతారని తెలిపారు.

మా తండాలో మా రాజ్యం అనే నినాదంతో గ్రామ పంచాయతీలు సాధించుకున్నాం, పోడు పట్టాలు సాధించాం, ఇంకా కొన్ని పోడు పట్టాలు మిగిలి ఉన్నాయి. 10 శాతం రిజర్వేషన్ సాధించాం. లంబాడి హక్కుల పోరాట సమితి పోరాటంతోనే ఇవి సాధ్యమయ్యాయి. ఇంకా మరెన్నో జాతి కోసం జాతి హక్కుల కోసం సాధించాల్సినవి ఉన్నాయి. గిరిజనులు ఐక్యంగా ఉంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న ఈ వేడుకల్లో గిరిజనులు సోదరీ సోదరీమణులు ఉద్యోగస్తులు మేధావులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.