23 July, 2026 | 1:45 AM

భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి

23-07-2026 01:12 AM

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా 

కరీంనగర్, జూలై 22 (విజయ క్రాంతి): జిల్లాలో చేపట్టిన కీలక సాగునీటి, రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రెవెన్యూ, ఇరిగేషన్, భూ సేకరణ విభాగం, నేషనల్ హైవేస్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాసం (ఆర్ అండ్ ఆర్) వంటి అంశాలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.

భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ఆలస్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి,  భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, కరీంనగర్ ఆర్డీవో షర్మిల, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.