23 July, 2026 | 1:59 AM

టీజీఐఐసీ భూసేకరణ నిలిపివేయాలి

23-07-2026 01:11 AM
  1. రైతుల ఆందోళన..
  2. ఎమ్మెల్యే కసిరెడ్డి భరోసా

కడ్తాల్, జులై 22(విజయక్రాంతి): మండలంలోని ముద్విన్ రెవెన్యూ పరిధిలోని ఎ క్వాయిపల్లిలో టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ) చేపడుతు న్న భూముల సర్వేను వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామ రైతులు కల్వకుర్తి ఎమ్మె ల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని హైదరాబాద్లో ని ఆయన నివాసంలో కలసి వినతిపత్రం స మర్పించారు.

ఈ అంశంపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో ఫో న్లో మాట్లాడి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకుల తో కలిసి ఎక్వాయిపల్లిలోని సర్వే జరుగుతు న్న ప్రాంతాన్ని నేరుగా సందర్శించి బాధితులకు భరోసానిచ్చారు. రైతుల పట్టా భూము లు కోల్పోకుండా చర్యలు తీసుకుంటానని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఆందోళనలో రైతులు..

ముద్విన్ రెవెన్యూ పరిధిలోని 179 సర్వే నంబర్ పరిధిలో ఉన్న 621 ఎకరాల అసైన్మెంట్ భూమితో పాటు, దానికి అను బంధంగా ఉన్న మరో 27 సర్వే నంబర్లలో కలిపి మొత్తం 1000 ఎకరాల్లో ఇండస్ట్రియ ల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న వార్తలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఫ్యూచర్ సిటీతో తమ గ్రా మ అభివృద్ధి చెందుతున్న వార్త ఒకపక్క సం తోషం కలిగిస్తున్నా మరోపక్క తమ భూము లు కోల్పోతున్నమనే బాధ గుబులు రేపుతుంది.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు లు పాలకుర్ల కరుణాకర్ గౌడ్, ఈర్లపల్లి రవి,తెలంగాణ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్, కిషన్ రెడ్డి,టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు సుమన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.