10-07-2025 12:00:00 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, జూలై 9 (విజయ క్రాంతి): భూభారతి ,రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పాత రికార్డుల ఆధారంగానే క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తులు పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
బుధవారం మోటకొండూర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత తహసిల్దార్ తో మాట్లాడుతూ.... భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి సమస్య పరిష్కరించుటకు తగు సూచనలు సలహాలు తెలియజేశారు. వచ్చిన ప్రతి దరఖాస్తు భూభారతిలో తప్పక నమోదు చేయాలన్నారు. దరఖాస్తుదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. తహసిల్దార్ నాగ దివ్య, సిబ్బంది ఉన్నారు.