10-07-2025 12:00:00 AM
పటాన్ చెరు, జులై 9 : మండల కేంద్రమైన జిన్నారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు ఊట్ల, దాదిగూడెం, రామ్ నగర్ కాలనీ నుంచి ప్రతి రోజు విద్యార్థులు కాలి నడకన వెళ్తుండడ గ్రామ మాజీ సర్పంచ్ కొరివి ఆంజనేయులు మాజీ జెడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ ద్వారా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే న్యూలాండ్ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి ఊట్ల, దాదిగూడెం, రామ్ నగర్ కాలనీలకు బుధవారం నుంచి బస్సు సౌకర్యం ప్రారంభమైంది.
విద్యార్థులు పాఠశాలకు, కళాశాలకు బస్సులో వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, మాజీ జెడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, న్యూలాండ్ పరిశ్రమ యాజమాన్యానికి గ్రామస్తుల ద్వారా కొరివి ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, శివశంకర్, భాస్కర్, డీ రమేశ్, నర్సింగ్ రావు, సంజీవ, మధు, దుర్గేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.