16-07-2025 12:57:49 AM
మట్టి సమునా పరీక్ష పత్రాలను పంపిణీ చేసిన కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్, జూలై 15 (విజయక్రాంతి) : రైతులందరు తప్పకుండా తమ వ్యవసాయ భూమి మట్టి పరీక్షలు చేయించుకోవాలని, భూమి పరిరక్షణకు అనుసారం ఎరువులు వాడలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం నార్నూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఇఫ్కో వారి ఆధ్వర్యంలో నానో యూరియా ప్లస్, నానో డిఏపి పై ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూసార పరిరక్షణ పథకం, భూసార పరీక్ష విశ్లేషణ పత్రా లను కలెక్టర్ రైతులకు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలోనే ప్రతీ గ్రామంలో సాయిల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్లు నిర్వహించడం జరుగుతుందన్నా రు. సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ అంటే, రైతుల భూమి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి, నేల పరీక్షలు నిర్వహించి, ప్రతి రైతుకు వ్యక్తికరించిన మట్టి ఆరోగ్య కార్డులను అం దించడం అన్నారు.
ఈ కార్డులలో నేల బలా లు, బలహీనతలు, సూక్ష్మ పోషకాల లోపా లు, పంటలకు అవసరమైన ఎరువుల సిఫార్సులు ఉంటాయని తెలిపారు. నేల పరీక్షల ద్వారా భూమిలో ఉన్న పోషక పదార్థాల స్థాయి వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చని అన్నారు. రైతులు అవసరమైన మొత్తంలో మాత్రమే ఎరువులను ఉపయోగించవచ్చు, ఇది అధిక ఖర్చులను తగ్గిస్తుందని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఈ అవగాహన సదస్సులో శిక్షణ కలెక్టర్ సలోని, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, జిల్లా ఉద్యాన వన అధికారి సుధాకర్, వ్యవసాయ కళాశాల అసోసియెట్ శ్రీధర్ చౌహన్, సినీయర్ శాస్తవేత్త డాక్టర్. రాజశేఖర్, సోయిల్ సయిన్స్ ప్రొఫెసర్ ప్రవీశ్ కుమార్, డిఆర్డీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.