calender_icon.png 16 July, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీర్‌పేట్ కమ్యూనిటీ హాల్ వేలంపై స్థానికుల ఆందోళన

16-07-2025 12:58:24 AM

నిలిపివేతకు ఎంపీ ఈటల హామీ

కాప్రా , జులై 15 (విజయక్రాంతి) : కాప్రా సర్కిల్  మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్లోని కమ్యూనిటీ హాల్‌ను హౌసింగ్ బోర్డు  డిపార్ట్మెంట్ వేలం వేయాలన్న నిర్ణయం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కమ్యూనిటీ హాలును పరిరక్షించాలని, వేలం ప్రక్రియను నిలిపివేయాలని హెచ్బీ కాలనీ ఫేజ్-1, ఫేజ్-2 కాలనీల సంక్షేమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ సమస్యను పరి ష్కరించాలని కోరుతూ కాలనీ సంక్షేమ సం ఘాల ప్రతినిధులు ఉప్పల్ ఎమ్మెల్యే బం డారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాసరెడ్డిలను కలిశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చొరవతో  ప్రతినిధులు మల్కా జిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి తమ సమస్యను వివరించారు.

దీనిపై స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డితో కలిసి సంబంధిత అధికారులను, మంత్రులను కలుస్తానని హామీ ఇచ్చారు. ఈ వేలం ప్రక్రియను నిలిపివేసి, సమస్య పరిష్కారానికి తన పూర్తి సహకారం అం దిస్తానని తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన హామీతో కమ్యూనిటీ హాల్ వేలం ఆగిపోతుందని కాలనీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.