ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి
కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ
ఖమ్మం, జూన్ 4 (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన గురువారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ డాక్టర్ సెల్ అద్యక్షులు డాక్టర్ కాపా మురళి కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
ఈ హెల్త్ క్యాంప్ లో ఉచిత షుగర్, బీపి టెస్టులు నిర్వహించి తగు సలహా సూచనలు ఇచ్చిన డాక్టర్ కాపా మురళి కృష్ణ. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సౌజన్యంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలే కాక జిల్లా లోని ప్రజలు ఈ ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని దీనికి గాను జిల్లా లోని జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, బ్లాక్,మండల, పట్టణ అధ్యక్షులు వారి వారి మండలాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. అదే విధంగా ఈనాటి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ డాక్టర్ సెల్ అద్యక్షులు కాపా మురళి కృష్ణ సౌజన్యంతో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించామని మరిన్ని హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తామని అన్నారు, ఈనాటి ప్రజావాణి కార్యక్రమంలో 15 దరఖాస్తులు అందాయని, హెల్త్ చెకప్ లో 58 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా మహిళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తూములూరి లక్ష్మీ నరసింహారావు,జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు కంచర్ల వెంకటనర్సయ్య,పులిబండ్ల చిట్టిబాబు, కొప్పుల గోవిందరావు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బండి మాధవరావు,జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దినేని రమేష్,పార్థ సారథి,వెంకట్రావు నాయక్, కొట్టే రాజశేఖర్, పాటి నర్సయ్య, గజ్జి సూర్యనారాయణ, ఫరీద్ ఖాద్రి,బబ్బూరి నరేందర్, పంది రాజు గౌడ్,దామా స్వరూప, శ్రీలత,సుగుణ, నీలవేణి తదితర నాయకులు పాల్గొన్నారు.






