రెవెన్యూ శాఖలో భూదందా
డిప్యూటీ కలెక్టర్ రామునాయక్ సస్పెన్షన్
వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హౌసింగ్ బోర్డు భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించామన్న మంత్రి
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తోన్న రామునాయక్‌ను సోమవారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన ద్వారా వెల్లడించారు. రాము నాయక్ 2013 నుంచి 2018 వరకు డిప్యూటేషన్‌పై హౌజింగ్ బోర్డులో భూ సేకరణ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు.
ఈ సమయంలో అనేక భూ దందాలకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో తక్షణమే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్, క్యూర్ పరిధిలో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు కోసం హౌజింగ్‌బోర్డు భూ ములను పరిశీలిస్తున్న సమయంలో రాము నాయక్ భూలీలలు బయటకు వచ్చాయన్నారు.
బహిరంగ మార్కెట్‌లో గజం రూ.2 లక్షలకు పైగా విలువ చేసే హైకోర్టు 5-6 గేట్ల మధ్య ఉన్న తెలంగాణహౌజింగ్ బోర్డుకు చెందిన 33.53 చదరపు గజాలస్థలాన్ని రామునాయక్ 2018 ఫిబ్రవరి 17న అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు బయటప డిందన్నారు. దీనిపై లోతైన విచారణ జరుపగా భూ దందాలు వెలుగులోకి వచ్చాయ ని తెలిపారు. హౌజింగ్ బోర్డు ఎల్‌ఏవోగా, బోర్డులో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఉద్యో గం నుంచి తొలగింపబడిన ఇఫ్తాకర్ అహ్మ ద్ భార్య సుబియాసుల్తానా పేరిట ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ డబ్బులు కూడా నేటి వరకు బోర్డుకు జమకాలేదన్నారు.
ఈ భూమికి సంబంధించిన పత్రాలను బోర్డు అనుమతులను పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేసిన నాటి చార్మినార్ సబ్ రిజిస్ట్రార్ పై కూడా విచారణకు ఆదేశించామన్నారు. 2025 ఏప్రిల్‌లో ఈ భూమిని సుబియా సుల్తానా మరొకరికి విక్రయించారని, ప్రభుత్వ పరంగా విచారణ జరిపిస్తున్నా మన్నారు. రాము నాయక్ భూ దందాలకు సంబంధించి 2017 నుంచి పలు కేసులు ఉన్నాయని, అప్పట్లో బీఆర్‌ఎస్ పాలకులు, అధికారులు స్పందించలేదని మంత్రి తెలిపారు.
విజయనగర్‌కాలనీలో 400 చదరపు గజాలు, తుల్జాగూడలో 22 చదరపు గజా లు, లక్ష్మిగూడలో 130 చదరపు గజాలు, మహబూబ్ గంజ్లో 497 చదరపు గజాల స్థలాలను పలువురి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని, వీటిపై ఇప్పటికే లోతైన విచారణ జరుపుతున్నామన్నారు. ఈ కేసుల్లో సబ్ రిజిస్ట్రార్ల పాత్రపైనా విచారణ జరపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని ఆదేశించామన్నారు.
రాము నాయక్ భూ అక్రమాలకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానంద్‌కు రిటైర్మెంట్ మరో పది సంవత్సరాలు ఉండగానే విధుల నుంచి శాశ్వతంగా తొలగించామని, మరో సూపరింటెండెంట్ బోనానాయక్‌ను సస్పెండ్ చేశా మన్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసిన వారెవ్వరినీ వదిలిపెట్టమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతటి పలుకుబడి ఉన్నా చట్టం ముందు సమానమే అని చెప్పారు.






