పేదలకు తక్షణమే పట్టాలివ్వాలి
- గుడిసెలను తొలగించాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం
వేలాది మందితో దద్దరిల్లిన ధర్నా చౌక్
హాజరైన సీపీఐ రాష్ట్ర నాయకులు
ముషీరాబాద్,మార్చి 24(విజయక్రాంతి): పేదలకు చెందాల్సిన భూదాన, ప్ర భుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు తక్షణమే పట్టాలను ఇవ్వడంతో పాటు ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5లక్షలు మంజురూ చేయాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలా కాకుండా గుడిసెలను తొలగించాలని చూసినా, ఈ భూము లను పెద్దలకు ధారదత్తం చేయాలనుకున్నా ప్రతిఘటిస్తామని హెచ్చరించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, భూదాన భూముల్లో గుడిసెలు వేసుకున్న నివసిస్తున్న పేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీలో భాగంగా మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా లో వేలాది మంది సిపిఐ కార్యకర్తలు, గుడిసెవాసులు పాల్గొన్నారు.
అనంతరం సిపిఐ కార్యకర్తలు, గుడిసె వాసుల నినాదాలతో ధర్నా చౌక్ దద్ధరిల్లింది. చల్లో అసెంబ్లీ పేరు తో వేలాదిగా తరలివచ్చిన గుడిసె వాసులు ప్రభుత్వ, భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు ప్రభుత్వ తక్షణమే పట్టాలు ఇవ్వాలని నినందించారు. ఈ ధర్నాలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సిపిఐ ఎంఎల్సి నెల్లికంటి సత్యం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి,
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమా కుల జంగయ్య, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేశ్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి. స్టాలిన్, హనమకొండ జిల్లా కార్య దర్శి కర్రె బిక్షపతి, వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాషామియా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రవీంద్రచారి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల సభ్యు లు రామస్వామి, తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాంతయ్య తదితరులున్నారు.




