12 June, 2026 | 1:42 AM

‘మా శక్తి’ బ్రాండ్‌తో లోగో ఆవిష్కరణ

12-06-2026 12:33 AM

ములుగు మహిళా ఉత్పత్తులకు కొత్త గుర్తింపు

ములుగు (మహబూబాబాద్) జూన్ 11 (విజయ క్రాంతి): బ్రాండింగ్ ,ప్యాకింగ్, డిజిటల్ మార్కెటింగ్తో మహిళలకు ఆర్థిక సాధికా రత లభిస్తుందని, ములుగు జిల్లా మహిళా సంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన ఆ హార పదార్థాలు, ఇతర వస్తువులకు బ్రాండ్ గుర్తింపు ఇవ్వడానికి ‘మా శక్తి’ లోగో ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీ తక్క అన్నారు.

ములుగు జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఇకపై మా శక్తి బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గురువా రం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమం త్ సహదేవరావు తో కలిసి మహిళా ఉత్పత్తు ల మా శక్తి బ్రాండ్ లోగోను ఆవిష్కరించా రు.

ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీత క్క మాట్లాడుతూ మహిళా సంఘాలు త యారు చేస్తున్న పసుపు, కారం, ఇప్పపువ్వు ఉత్పత్తులు, హస్తకళలు, పెయింటింగ్స్, బొ మ్మలు, టైలరింగ్ ఉత్పత్తులు తదితర వస్తువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా మా శక్తి బ్రాండ్ను రూపొందించిన ట్లు తెలిపారు. బ్రాండింగ్, ప్యాకింగ్, లేబులింగ్ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరగడం తో పాటు మార్కెట్లో విశ్వసనీయత, గౌరవం లభిస్తాయని పేర్కొన్నారు.

మహిళలు తయా రు చేసే ఉత్పత్తులను జిల్లా స్థాయిలోనే కా కుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మా ర్కెట్లకు తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి డిజిటల్ వేదికల ద్వారా విక్రయాలకు అవకాశం కల్పించి మహిళల ఆదాయాన్ని పెం చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

జిల్లాలో మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, ఒకే గుర్తింపు కల్పించ డం ద్వారా ములుగు జిల్లాకు ప్రత్యేక గుర్తిం పు లభించడంతో పాటు మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపాలిటీ చైర్ పర్సన్ చంద్రకళ, అ దనపు డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఎంలు, ఏపీఎంలు, అధికారులు పాల్గొన్నారు.