మున్సిపాలిటీ అభివృద్ధియే లక్ష్యం
ఎమ్మెల్యే తోట
బిచ్కుంద జూన్ 11 (విజయక్రాంతి): బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక వేస్తామని కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. గురువారం నాడు బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయంలో బిచ్కుంద పట్టణ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించినారు.
ఈ సందర్భంగా పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర ప్రజా అవసరాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి త్వరితగతిన పరిష్కరించడంతో పాటు, బిచ్కుంద పట్టణ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బస్టాండ్ పరిసర ప్రాంతాన్ని పరిశీలించి వాటికి అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






