ముందు అఫ్ఘన్ సిక్కులను కాపాడండి
కెనడా మాజీ రక్షణ శాఖ మంత్రి ఆదేశాలు
న్యూఢిల్లీ జూన్ 28: తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ మీద తమ ప్రతాపం చూపుతున్న సమయంలో 2021లో కెనడా రక్షణ మంత్రిగా విధులు నిర్వర్తించిన హర్జిత్ సజ్జన్ ఆదేశాలు పెను దుమారం రేపుతున్నాయి. ముందు అఫ్ఘన్ సిక్కులను కాపాడండి అని రక్షణ దళాలకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు పలు వార్తా కథనాలు వెలుగులోకి తెచ్చా యి. వారిని కాపాడడం మాత్రమే కాకుండా కెనడియన్ల కోసం కేటాయించిన నిధులను కూడా ఆయన అఫ్ఘన్ల కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది. కెనడా పత్రిక తాజా కథనాల ప్రకారం.. అఫ్ఘనిస్తాన్‌లో అవస్థలు పడుతున్న కెనడా పౌరుల కోసం కేటాయించిన నిధులను సిక్కులను కాపాడేందుకు ఉపయోగించారు. కానీ ఈ ఆరోపణలను మాజీ మంత్రి సజ్జన్ కొట్టిపారేశారు. తాను అఫ్ఘన్ సిక్కులను కాపాడమని కెనడా సాయుధ దళాలకు ఆదేశాలు ఇవ్వలేదని తెలిపినట్లు అధికా రిక వార్తా సంస్థ కథనం ప్రచురించింది. తాను కేవలం కెనడియన్ సిక్ గ్రూప్ అందించిన సమాచారాన్ని మాత్రమే సీఏఎఫ్‌తో పంచుకున్నట్లు తెలిపాడు.






