calender_icon.png 20 January, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాప్రొస్కోపిక్ కిడ్నీ ఆపరేషన్

18-01-2026 12:00:00 AM

వరంగల్‌లో రెండేళ్ల చిన్నారికి తొలిసారి అధునాతన 

త్రీడీ సాంకేతికతతో చికిత్స

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): అదునాతన త్రీడి సాంకేతికతతో మొట్ట మొదటిసారిగా వరంగల్ జిల్లాలో రెండేళ్ల చిన్నారికి పైలోప్లాస్టి ఆపరేషన్లు దిగ్విజయంగా పూర్తి చేసినట్లు హనుకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌కు చెందిన  వి వేదాన్షి అనే రెండు సంవత్సరాల చిన్నారికి కిడ్నీ నుంచి మూత్రం తీసుకువెళ్లే నాళం సన్నబడినట్లు తెలిపారు. చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లగా నాలు గు లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పడంతో తమ ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు.

తక్కువ ఖర్చుతో చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి 72 గంటల్లో ఇం టికి పంపినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో డాక్టర్ రఫీ, అనస్తీషీయ వైద్యుడు డాక్టర్ సామ్రాట్ పాల్గొన్నారు. ఇదే తరహాలో మరో మూడు త్రీడి లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు యూ రాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.