విద్యార్థులపై లాఠీచార్జ్ అమానుషం
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
భూపాలపల్లి, టౌన్,జూలై 23 (విజయంక్రాంతి): విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ను ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐసా (ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్) జిల్లా నాయకులు బుర్ర స్వాతి, బంధు సుజాత డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వంటి ఘటనలపై బాధ్యత వహిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అన్యాయమని, కేంద్రం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టకపోతే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు.






