3 March, 2026 | 3:56 AM

నవ్వించే రాకాస

03-03-2026 01:05 AM

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన తాజాచిత్రం ‘రాకాస’. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుఖ్విందర్ సింగ్, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, బజర్దస్త్ రోహిణి, ‘నైంటీస్’ రోహన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన కంటెంట్‌కు, గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.

ఇక ఇప్పుడు మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘నరకం నుంచి సందేశం వస్తుంది.. ఇక సమయం లేదు.. మన ఊరి శాపమిది.. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’ అంటూ ఊరిని, అక్కడి జనాన్ని పరిచ యం చేస్తూ సాగిన ఈ టీజర్ ఆకట్టు కుంటోంది.

ఇందులో చూపించిన యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్‌ఆర్ అన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక చివర్లో హీరో భయపడుతూ.. ‘స్త్రీ.. రేపు రా’ అనే డైలాగ్ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే.. నవ్విస్తూ భయపెట్టడంతో పాటు ఏదో ఓ కొత్త కాన్సెఫ్టును ఈ సినిమాలో పరిచయం చేయబోతున్న ట్టు అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్; సినిమాటోగ్రఫీ: రాజు ఎదురోలు; ఎడిటర్: అన్వర్ అలీ; ఆర్ట్: పుల్ల విష్ణువర్ధన్.