calender_icon.png 2 August, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాభూమి రథయాత్ర కరపత్రాల ఆవిష్కరణ

02-08-2025 03:15:19 PM

మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారం కోసం లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమై ఈ నెల 6న డాక్టర్ విశారదన్ మహరాజ్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఐబి చౌరస్తాలో శనివారం మాభూమి రథయాత్ర కరపత్రాలను మంచిర్యాల జిల్లా బీసీ, ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ యాత్రకు జిల్లా ప్రజలు, నాయకులు, అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు సంపూర్ణ భాగస్వాములు కావాలని వారు కోరారు. భవన నిర్మాణ సంగం ఫంక్షన్ హాల్ లో నిర్వహించే ఆవిర్భావ సభకు బహుజన మేధావులు, విద్యావంతులు, కార్మికులు, కర్షకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎదునూరి రమేష్, ప్రధాన కార్యదర్శి మంచర్ల సదానందం, జిల్లా నాయకులు జంగ పెల్లి రామస్వామి, నందిపాటి రాజు, రేగుంట రాకేష్, తాళ్ళపెల్లి చంద్రశేఖర్, గుడిసెల సురేందర్, జనం పెళ్లి వెంకటేష్, జాతీయబీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, బీసీ నాయకులు గజ్జెల్లి వెంకన్న,శాఖపురి భీమ్సేన్, బిక్షపతి, చంద్రమౌళి, అశోక్, గుండా రాయమల్లు, వేముల అశోక్, ఆరెందుల రాజేశం, అంకం సతీష్, తదితరులు పాల్గొన్నారు.