calender_icon.png 2 August, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంతో ఉపయోగకరం

02-08-2025 03:17:44 PM

మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ డి జానకి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): నేరాల పరిశీలనలో ఆధునిక సాంకేతికతను వినియోగించి, న్యాయ నిపుణుల సహకారంతో నేర నిదానంలో వేగం, ఖచ్చితత్వం పెంచే దిశగా మొబైల్ ఫోన్స్ ఫ్యాన్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ డి జానకి(District SP D Janaki) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ఎస్పీ డి జానకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఈ విధానాలతో తెలంగాణ పోలీస్ శాఖ మరొక అడుగు ముందుకు వేసిందన్నారు.

నేర పరిశీలనలో ఉపయోగపడే మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫెర్స్ నుండి మహబూబ్ నగర్ జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ మొబైల్ వ్యాన్‌లో ఆధునిక ఫోరెన్సిక్ పరికరాలు, క్లూస్ టీమ్ కు అవసరమైన డివైజులు అందుబాటులో ఉండటం విశేషమని, సంఘటన స్థలానికి తక్షణమే చేరుకొని, ఆధారాలను సేకరించేలా ఈ వాహనం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.బి రత్నం, ఎ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఏ ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆర్ఐ లు కృష్ణయ్య, రవి, నాగేష్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.