02-08-2025 03:12:16 PM
- నిర్వాసితుల సుఖసంతోషాలే మాకు ముఖ్యం..
- డిసెంబర్ 9లోపు నిర్వాసితులకు నిధులు అందజేస్తాం..
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రాజకీయాలను పక్కనపెట్టి అందరం కలిసి భోజనం ఆహ్వానిస్తున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఉదండాపూర్ భూ నిర్వాసితులతో ఆదివారం సహా పంక్తి భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ 250 కోట్లు మంజూరు కావడం జరిగిందని ఇటీవల ఉదండాపూర్ నిర్వాసితులకు ప్రస్తుతం రూ.175 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, డిసెంబర్ 9వ తేదీలోపు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందజేస్తామని తెలిపారు. అవార్డు పాస్ కానందుకే ఉదండాపూర్ పరిహారం చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. వల్లూరు గ్రామం, తాండాలకు చెందిన ప్రజలు అధికారులకు సహకరించడంతో వారి గ్రామాలకు అవార్డు పాసైయిందని, వారి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను కూడా జమ చేసిందని చెప్పారు. కాలేదన్నారు.
ఉదండాపూర్ కు చెందిన నిర్వాసితులు అందరూ మంగళవారం కలెక్టరేట్ కు వెళ్లి తమ అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించుకోవాలని, ఆ తర్వాత వారికి అవార్డు పాస్ కావడం జరుగుతుందన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లో రూ.16.30 లక్షలు చెల్లించినా ఆ తర్వాత పరిహారం మొత్తాన్ని పెంచినప్పుడు ఆమేరకు వ్యత్యాస మొత్తాన్ని నిర్వాసితులు అందరికీ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్ లో రూ.45 కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.30 కోట్లు, జూలై లో రూ.175 కోట్లు చొప్పున మొత్తం రూ.250 కోట్లు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచే ప్రతిపాదన ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఇప్పటి వరకూ దాన్ని ప్రభుత్వం తిరస్కరించలేదని విమర్శించారు. ముందు తరాలకు ఎంతో భవిష్యత్తును అందించేందుకు వారు నిరస్రాయలుగా అవుతున్నారని వారితో అందరం కలిసి భోజనం చేసి వారు సుఖ సంతోషాలతో ఉండేలా ఆశిద్దాం అని పిలుపునిచ్చారు.
167వ నెంబర్ హైవేపై మరో సమావేశం...
జడ్చర్ల మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 167లో జడ్చర్లలోని పాత బజారు పెద్ద వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా డిజైన్ ఉందని చెబుతున్న వారు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసహం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కరించడానికి జాతీయ రహదారుల శాఖ అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, రహదారిలో ఉన్న విగ్రహాలను తరలించే విషయంలో ఉన్న సమస్యను కూడా అందరితో కలిసి చర్చించి పరిష్కరించాలని ఇప్పటికే తాను మున్సిపల్ ఛైర్మెన్, కౌన్సిలర్లు, కమీషనర్ ను కోరామన్నారు.
తాను చదువుకున్న వాడినని తన వద్ద దొంగ డిగ్రీలు లేవని, అందుకే ఈ విషయంలో ఎవరో చేసిన వాఖ్యలపై తాను స్పందించబోనని స్పష్టం చేసారు. జడ్చర్ల బైపాస్ రోడ్ విషయం గురించి కూడా అధికారిక డీపీఆర్ తర్వాత స్పష్టత వస్తుందని తెలిపారు. నిర్వాసితులకు మరో రెండు వందల కోట్లు అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగిందని ఆ నిధులు వస్తాయన్నారు.