calender_icon.png 10 August, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ ఆదివాసి దినోత్సవం

09-08-2025 05:41:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఆదివాసి నాయకపోడ్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం అని శనివారం నిర్మల్లో ఘనంగా నిర్వహించారు, నిర్మల్ జిల్లా(Nirmal District) అధ్యక్షులు ముచ్చిండ్లవ రవికుమార్, ప్రధానకార్యదర్శి అనుగొండ సతీష్ కలిసి ఆదివాసి వీరులు కొమరంభిం, రాంజీ గౌడ్, భారత మహానాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన వీరులను స్మరించుకోవడం ప్రతి తరానికి గర్వకారణమని, వారి త్యాగస్ఫూర్తి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆదివాసుల ఆత్మగౌరవం, సంస్కృతి, హక్కుల పరిరక్షణ కోసం సంఘం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడ్ ఉద్యోగ సంఘ సభ్యులు కస్తూరి భీమేశ్వర్, సొండి శివశంకర్, బాపయ్య, గుండంపల్లి సాయన్న, గురుడు సునీల్, పోశెట్టి ముత్తన్న, బాలాజీ ,గంపల భూమేష్, రాజేశ్వర్, కాల శంకర్, పిరాజి, తదితరులు పాల్గొన్నారు.