గుండెపోటుతో న్యాయవాది మృతి
02-12-2024 12:00 AM
ఖమ్మం, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది, హక్కుల నా యకుడు చల్లా శంకర్ ఆదివారం మృతి చెందారు. మాత్రల కోసం మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న మెడికల్ షాపునకు వెళ్లిన ఆయన కళ్లు తిరుగుతుండటంతో వెంటనే ఆటోలో ఇం టికి చేరుకున్నారు. అక్కడ కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు ఆసుప త్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యు లు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందినట్టు నిర్ధారించారు. శంకర్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉ న్నారు. శంకరన్నగా పేరుగాంచిన ఆయన విప్లవ, ప్రజా హక్కుల ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. విప్ల వ కార్యకర్తలకు ఆయన ఇల్లు నిలయంగా ఉండేది. ఆయన అకాల మృతికి సహచర న్యాయవాదులు సంతాపం తెలిపారు.




