6 April, 2026 | 11:59 AM

పత్తాలేని నీటి సంఘాలు!

02-12-2024 12:00 AM
  1. పుష్కరం కాలంగా కమిటీల నియమాకం లేదు
  2. చిన్న నీటి వనరుల పర్యవేక్షణ శూన్యం

సిరిసిల్ల, డిసెంబర్ 1 (విజయక్రాంతి): నీటి సంఘాలు లేకపోవడంతో చిన్న నీటి వనరులు పరిరక్షణ కరువైంది. ఆయకట్టు రైతుల సమస్యలు పరిష్కరించే వారే కరువయ్యారు. 14 ఏళ్లుగా నీటి సంఘాల కమిటీ లను ఏర్పాటు ప్రక్రియ ఊసేలేకుండా పో యింది. దీంతో చిన్న నీటి వనరులు అన్యాక్రాంతంతో పాటు, ఆయకట్టు రైతుల సమ స్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయి.

ఈ నీటి సంఘాలు చెరువు, కుంటల నిర్వహణతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టేవి. గత ప్రభుత్వ పాలనలో ఆదర్శ రైతు విధానాన్ని రద్దు చేసి, రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసినప్పటికీ, చిన్న నీటి వనరుల సంరక్షణ బాధ్యతలు అప్పగించలేదు. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమన్వయ సమితులను రద్దు చేసింది.

ఆదర్శ రైతు విధానాన్ని తిరిగి తీసుకువచ్చింది. దీంతోపాటు నీటి సంఘాల కమిటీలను కూడా తిరిగి ఏర్పాటు చేస్తే గ్రామాల్లో నెలకొన్న ఆయకట్టు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతా యనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. 

2010లో నిలిచిపోయిన ప్రక్రియ 

సిరిసిల్ల జిల్లాలో 665 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో 2010లో నీటి సంఘాల ఓటర్ల సవరణతోనే ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో తిరిగి నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ చేపట్టినట్టే చేసి, నిలిపివేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి సంఘాల ఏర్పాటు కనుమరుగైపోయింది. గ్రామాల్లో చెరువు, కుంటలను కాపాడేందుకు నీటి సంఘాల కమిటీలు పని చేసేవి.

ఆ కమిటీలను ఇప్పుడు నియమిస్తే, నీటి వనరులను పూర్తి స్థాయిలో పరిరక్షణ చేసేందుకు వీలుంటుందని పలువురు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నీటి సంఘాల కమిటీ నిర్వహణలో ఆయకట్టు భూములకు సాగు నీరు సక్రమంగా అందే లా చర్యలు తీసుకునేవి. ప్రస్తుతం కమిటీలు లేకపోవడంతో ఆయకట్టు రైతులు సాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు.

సిరిసిల్ల జిల్లాలో మూడు ప్రాజెక్ట్‌లు ఉండ గా, మరో ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. గంభీరావుపేట  ఎగువ మానేరు ప్రాజెక్ట్‌తో పాటు మిడ్‌మానేరు (శ్రీరాజరాజేశ్వర) ఇల్లంతకుంట మండలం అనంతగిరి ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. కోనరావుపేట మండ లం మల్కపేట రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసుకోని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 

గత ప్రభుత్వంలో చెరువు, కుంటల మరమ్మతు పనులు చేసేందుకు మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టింది. కొంత వరకు మరమ్మతులు చేసి, పూర్వ వైభవం తీసుకవచ్చేలా చర్యలు చేపట్టింది. కానీ వాటి నిర్వహణ బాధ్యతలు లేకపోవడంతో ఎప్పటి లాగే మారిపోయాయి. వంద ఎకరాల పైగా ఉన్న ఆయకట్టు ఉన్న చెరువులు 104 ఉండగా,  వంద లోపు 561 చెరువు, కుంటలు ఉన్నాయి.

అంతేకాకుండా మానే రుపై చెక్ డ్యాంలు సైతం నిర్మించినప్పటికీ వాటి పర్యవేక్షణ లోపంతో  వరదల దాటికి కొట్టుకుపోయాయి. చెరువుల రక్షణ కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా నీటి సంఘాల కమిటీలను నియమించి, ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు కోవాలని ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు కోరుతున్నారు.