6 April, 2026 | 8:15 AM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

02-12-2024 12:00 AM

ఖమ్మం, డిసెంబర్ 1 (విజయక్రాంతి):  వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడగా పలువురికి గాయాలైన ఘటన సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలోని సిం గరేణి ఓపెన్‌కాస్టు వద్ద చోటుచేసుకున్నది. వివరాలిలా.. జగన్నాథపురం గ్రామానికి చెందిన ఊకే రాజు, స్వ రూప దంపతులు కుమారుడు యశ్వంత్‌తో ఆదివారం బైక్‌పై చిన్నతిరుపతికి వెళ్తున్నారు.

ఈక్రమంలో సింగరేణి సమంత క్యాంప్ వద్ద మిత్రుడి కోసం రోడ్డు పక్కన వేచి ఉండగా వారిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా దంపతులిద్దరూ గా యపడ్డారు. అదే ప్రాంతంలో మధ్యా హ్నం 3 గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీకొని గొల్లమందల రామకృష్ణ (32) చనిపోయాడు. ఈ ప్రాం తంలో డివైడర్, ప్రమాద సూచికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటాన్నాయి. అధికారులు స్పందించి, రోడ్డు ప్ర మాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఏ ర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.