15 June, 2026 | 7:55 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

షాద్ నగర్ లో న్యాయవాదుల విధుల బహిష్కరణ

05-02-2026 04:40 PM

అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ తేవాలి: న్యాయవాదుల డిమాండ్.. 

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు వినతిపత్రం 

షాద్‌నగర్,(విజయక్రాంతి): మహిళా న్యాయవాదిని అతి దారుణంగా హతమార్చడం హేయనీయమని షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి గుండుబాయి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  గురువారం పట్టణంలోని కోర్టు ఆవరణలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న చిత్రపటానికి న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వాలు న్యాయవాదులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనంతరం కోర్టు ప్రధాన ద్వారం వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలంటూ నినాదాలు చేశారు. అనంతరం న్యాయవాదులంతా కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోరుతూ వినతిపత్రం అందించారు.

సమస్యను అసెంబ్లీలో చర్చిస్తా.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. 

ప్రతినిత్యం దగాపడ్డ సామాన్యులకు న్యాయాన్ని అందించేందుకు కృషి చేసే న్యాయవాదులను హత్య చేయడం అత్యంత హేయనీయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. న్యాయవాదుల విన్నపం నూటికి నూరుపాళ్ళు సరైనదని, దీనిపై అసెంబ్లీ సెషన్ లో మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదు లు ఆందోళనలో పాల్గొన్నారు.