05-02-2026 04:38:04 PM
చొప్పదండి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రూ.45.15 కోట్లతో కరీంనగర్ జిల్లా రామడుగులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. రూ. 5 కోట్లతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.