calender_icon.png 8 February, 2026 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వప్న హత్య పట్ల న్యాయవాదుల నిరసన

06-02-2026 12:00:00 AM

  1. కోర్టుల విధులకు దూరంగా న్యాయవాదులు 
  2. జిల్లాకోర్టు ప్రధాన ద్వారం ముందు నిలబడి నినాదాలు 
  3. చట్టాలే అందరికి ప్రమాణికం కావాలి 
  4. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు 

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బార్ అసోసియేషన్ న్యాయవాది గొటిక స్వప్న హత్యను నిరసిస్తు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాకోర్టు సముదాయంలోని బార్ సమావేశపు హల్ లో బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు న్యాయవాది హత్య ఉదంతాన్ని వివరించారు.

తోడబుట్టిన అన్ననే చెల్లెలు స్వప్న ను ఆస్థికోసం అంతం చేశాడని తెలిపారు. అనంతరం బార్ అధ్యక్షుడు సాయరెడ్డి మాట్లాడుతూ చట్టాలు అనేవి ప్రజల న్యాయపరమైన వివాదాలను చట్టబద్దంగా పరిష్కరించుకోవాలని చెబుతున్నాయని తెలిపారు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్ట ప్రకారం శిక్షలు ఖాయమని అన్నారు. అన్ననే చెల్లెలును చంపడం భాదాకరమని, బంధాలు, బంధుత్వాలు మాయమై, హత్యల విషసంస్కృతి కానరావడం ఆందోళనకరమేనని అన్నారు.

స్వప్న హత్యకేసు విచారణ పారదర్శకంగా నిర్వహించే విదంగా పోలీసులు కృషి చేయాలని అన్నారు. ముద్దాయికి చట్ట ప్రకారం శిక్ష పడే విదంగా న్యాయవాద సమాజం సహకరిస్తుందని పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం త్వరగతిన చట్టసభలు ఆమోదించాలని సాయరెడ్డి కోరారు.స్వప్న కు నివాళిగా రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించినట్లు ఆయన తెలిపారు.

స్వప్న హత్యను నిరసిస్తు గురువారం జిల్లాకోర్టు సముదాయంలోని కోర్టులలో విధులకు దూరంగా ఉండి జిల్లాకోర్టు ప్రధాన ద్వారం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు మాణిక్ రాజు తెలిపారు.  బార్ ఉపాధ్యక్షుడు రెంజర్ల సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీ రాణి,కోశాధికారి నారాయణ దాసు, క్రీడలకార్యదర్శి మంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.