calender_icon.png 8 February, 2026 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

06-02-2026 12:00:00 AM

అధికారులతో  కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీ.పీ సాయి చైతన్య సమీక్ష 

నిజామాబాద్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) : అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న నేప థ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా అధికారులతో, సీఎంఓ కార్యాలయం నుంచి హాజరైన భద్రతా విభాగం అధికారులతో కలిసి గురువారం తుది ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. 

డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ప్రాంతాలను నిశితంగా పరిశీలన చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావులే కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు సీఎం కాన్వాయ్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు.

బహిరంగ సభకు వచ్చే వారి వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన ప్రదేశంలోనే వాహనాలు నిలిపేలా చూడాలన్నారు. సీఎం సభకు విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, సభకు హాజరయ్యే వారికి తాగునీరు వంటి వసతులు కల్పిస్తూ, ప్రథమ చికిత్స సదుపాయం, అంబులెన్స్ అందుబాటులో ఉం చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాగా, ముఖ్యమంత్రి భద్రతకు పక డ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, సీ.ఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసు కోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేయాలన్నారు.

ముందస్తు గానే ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూ చించారు.  ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, సీఎంఓ కార్యాలయ భద్రతా అధికారి మాధవరావు, ఏసీపీలు రాజా వెంకట్‌రెడ్డి, ప్రకాష్, మస్తాన్ అలీ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.