16 April, 2026 | 8:19 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

వైన్ షాపులపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

20-02-2026 12:51 AM

మునుగోడు, ఫిబ్రవరి 19 : నియోజకవర్గ కేంద్రంలో వైన్ షాపుల సమయపాలనపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న వైన్ షాప్ వద్ద ఆగి పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయ న, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రం 6:00 గంటల వరకు పర్మిట్ రూమ్లలో గానీ, షాప్ పరిసర ప్రాంతాల్లో గానీ ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవనానికి అనుమతి లేదని మరోమారు గట్టిగా హెచ్చరించారు.

సమయపాలనలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని తెలిపారు.వైన్ షాపుల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిబంధనలు కచ్చితంగా పాటించాలని నిర్వాహ కులకు సూచించారు.నియోజకవర్గంలో చట్టాలు, నియమాలు కఠినంగా అమలు కావాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.