28 August, 2026 | 6:56 AM

కీలక ఘట్టంలో లెగసీ

28-08-2026 12:00 AM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, దర్శకుడు సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’. ఈ చిత్రాన్ని కలాహీ మీడియా పతాకంపై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్‌రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు కేకే మేనన్ అత్యంత శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.

మురళీమోహన్, రావు రమేశ్, సచిన్ ఖేడేకర్, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, కలెక్టర్ శ్రీనివాస్, రవి కాలే, అమిత్ తివారీ కీలక పాత్రల్లో కనిపించను న్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. శుక్రవారం నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు కీలక చిత్రీకరణ జరగనుంది. ప్రధాన తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్లో కథకు కీలకమైన సన్నివేశాలతోపాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, పాటలను చిత్రీకరించ నున్నారు.

డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి కథ: సాయికిరణ్‌రెడ్డి దైదా, కవి సిద్ధార్థ; డీవోపీ: జిజు సన్నీ; సంగీతం: గోవింద్ వసంత; పాటలు: అనంత శ్రీరామ్, కవి సిద్ధార్థ; ఎడిటింగ్: శిరీష్ ప్రసాద్; ఆర్ట్: రాజీవ్ నాయర్; యాక్షన్: జాషువా; నిర్మాతలు: యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా; రచన సాయికిరణ్‌రెడ్డి దైదా.