13-11-2025 01:07:51 AM
నిజామాబాద్ లీగల్ కరస్పాండెంట్, నవంబర్ 12 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్ తన సహచర లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అయిన ఉదయ కృష్ణ, మహమ్మద్ షాదుల్ల, రవిబాబు, రజిత, శుభం, ప్రమోద్, బాలాజీ, విశ్వక్ సేన్ రాజ్, మహిపాల్, మహ్మద్ ఖలీద్లతో కలిసి న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ గా విధులు నిర్వహించి పదోన్నతిపై అదనపు జిల్లాజడ్జిగా బదిలీపై వెలుతున్న ఉదయ్ భాస్కర్ రావుకు పూలగుచ్చo, మెమెంటో, శాలువతో సత్కరించి వీడ్కోలు పలికారు.
ఈ సందర్బంగా జడ్జి ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ పేదలైన ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో లీగల్ ఎయిడ్ సిస్టమ్ న్యాయవాదులు చాలా కృషి చేశారని అన్నారు. ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్లిన రాజ్యాంగ ప్రామాణికతే ప్రాణపదంగా ఉంటుందని జడ్జి ఉదయ్ పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ భారత లక్ష్మీ, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నాల్సా, రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థల ప్రోధ్బలం, ప్రోత్సాహం, వెన్నుదన్ను తో న్యాయసేవల మార్గం వెంట నడిచినట్లు ఆయన తెలిపారు. సుబేధార్ మాట్లాడుతూ ఉదయ్ భాస్కర్ రావు జడ్జిగా ఏడు నెలలు తక్కువకాలమే విధులు నిర్వహించిన,సంస్థను ప్రజలకు ఎక్కువగా పరిచయం చేశారని అన్నారు.