13-11-2025 01:06:05 AM
అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రంగా హైదరాబాద్
మొత్తం కంపెనీల్లో 23 శాతం తెలంగాణలోనే 9 లక్షలకు పైగా ప్రత్యక్ష, 30 లక్షలకు పైగా పరోక్ష ఉద్యోగాలు
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : రాష్ట్రం ప్రగతి పథాన ముందుకు సాగాలంటే ఉపా ధి కల్పన ఎంతో కీలకం. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవే ట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతు న్న నేపథ్యంలో ఉపాధి కల్పనలో ఐటీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఐటీ రంగంలోని అవకాశాలను ఒడిసి పట్టుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
ఐటీ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తూ తెలంగాణ విద్యార్థులకు సాంకేతిక రంగంలో ఉద్యోగాలు పొందేందుకు మార్గం సుగమం చేస్తుంది. దేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగ అవకాశాలు సృష్టించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. తెలంగాణ ఐటీ రంగం రాష్ర్ట ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తోంది.
హైదరాబా దును కేంద్రంగా చేసుకుని వివిధ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు వేగంగా విస్తరిస్తున్నాయి. దేశ ఐటీ వృద్ధిలో తెలంగాణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రతీ నాలుగు కంపెనీలలో ఒకటి తెలంగాణలో ఉండటం రాష్ర్ట ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆయా దేశాల్లో ఐటీ కంపెనీల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ క్రమంలో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలన్నీ ప్రస్తుతం భారత్ వైపు చూస్తున్నాయి.
ఇక్కడ తమ కంపెనీలను ఏర్పాటు చేసి కార్యకలాపాలను ప్రారం భించాలని ముందుకు వస్తున్నాయి. దీంతో దేశంలో ఐటీ రంగం గణనీయంగా వృద్ధి సా ధిస్తోంది. అయితే దేశంలో కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం విజయం సాధిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 వేల ఐటీ కంపెనీలుండగా అందులో 7 వేల కంపెనీలు తెలంగాణలోనే ఉండటం విశేషం.
ఈ జాబితాలో 10 వేల కంపెనీలతో కర్ణాటక రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రెండో స్థానం లో నిలువడం ద్వారా ఐటీ రంగం మరో మై లురాయిని అధిరోహించింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఐటీ కంపెనీలలో 23 శాతం సంస్థలు తెలంగాణలోనే పనిచేస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి బహుళజాతి దిగ్గజాల నుంచి స్థానిక స్టార్టప్‌ల వరకు ఇక్క డ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మొత్తం కంపెనీల్లో కేవలం 8 రాష్ట్రాల్లోనే 29 వేలకు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి.
అంతర్జాతీయ కంపెనీల ఆకర్షణ..
దక్షిణ భారతదేశంలో అంతర్జాతీయ కం పెనీలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ మరింత అవతరిస్తోంది. గ్లోబల్ టెక్ దిగ్గజా లు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్, మెటా, ఒరాకిల్, డెలాయిట్ వంటి సంస్థలు తమ అత్యంత పెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసుకోవడం రాష్ర్ట ప్రతిష్ఠను పెంచింది. గత రెండు సంవత్సరాల్లోనే 80కి పైగా విదేశీ కంపెనీలు హైదరాబాద్‌లో కొత్త డెవలప్‌మెంట్ సెంటర్లను ప్రారంభించాయి.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయా లు, నైపుణ్యమున్న మానవ వనరులు, సులభమైన పాలసీలు ఇవన్నీ కలిసి నగరాన్ని గ్లోబల్ టెక్ హబ్‌గా నిలబెట్టాయి. హైదరాబాద్ ప్రపంచంలో టాప్ ఐటీ డెస్టినేషన్లలో ఒకటిగా నిలిచింది. నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, పోచారంలో కొత్త ఐటీపార్కులు రూపుదిద్దుకుంటున్నాయి.
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి..
దేశంలో ఉపాధి సృష్టిలో తెలంగాణ ఐటీ రంగం అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సమగ్ర నివేదిక ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో ఐటీ రంగం ద్వారా 9 లక్షలకు పైగా ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తున్నది. పరోక్షంగా మరో సుమారు 30 లక్షల మందికి జీవనోపాధిని అందిస్తున్నది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీ, ఇన్నో వేషన్ హబ్‌లు, టీ వీ టాస్క్ వంటి ప్రాజెక్టులు రాష్ర్ట యువతకు ప్రపంచస్థాయి వేదికలుగా మారుతున్నాయి.
మహి ళల ఉపాధి విషయంలోనూ తెలంగాణ ముందుంది. టాస్క్ ద్వారా శిక్షణ పొందిన యువతలో 42 శాతం మంది మహిళలే ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఐటీ అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లోనూ ఐటీ కంపెనీలను విస్తరిస్తున్నారు.