న్యాయపరమైన పరిహారం చెల్లించాలి
04-08-2026 12:00 AM
ఉద్యోగం, 500 గజాల ప్లాటు ఇవ్వాలని బీఎస్పీ డిమాండ్
ఇబ్రహీంపట్నం, అగస్టు 3(విజయక్రాంతి): వివిధ ప్రభుత్వ పరిశ్రమలు, కంపెనీల కోసం భూములు కోల్పోయిన రైతులకు పర్మినెంట్ ఉద్యోగంతో పాటు 500 గజాల హెచ్‌ఎమ్డీఏ ప్లాటు కేటాయించాలని బీఎస్పీ ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు సి.హెచ్. కరుణాకర్ డిమాండ్ చేశారు.
సోమవారం ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాల యంలో జరిగిన ’ప్రజావాణి’ కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఆదిభట్ల సెజ్ , టీసీస్ , బీడీఎల్, ఏరోస్పేస్ వంటి సంస్థల ఏర్పాటు సమయంలో భూనిర్వాసితులకు 70 శాతం ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గణేష్, కొండ్రు రఘుపతి, మల్లెల అశోక్ తదితరులు పాల్గొన్నారు.






