రియల్ కోర్ట్ డ్రామాను కళ్లకు కట్టే ‘లీగల్లీ వీర్’
10-12-2024 12:00 AM
వీర్‌రెడ్డి, దయానంద్‌రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హీరో వీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కరోనా టైంలో నాకు సినిమా వాళ్లతో పరిచయం ఏర్పడింది. అప్పుడే మంచి సినిమా చేద్దామనుకున్న. రియల్ కోర్టు డ్రామాను మా సినిమాలో చూపించాం’ అన్నారు. డైరెక్టర్ రవి, కొరియోగ్రాఫర్ వల్లం కళాధర్, నటుడు గిరిధర్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






