14 July, 2026 | 4:03 PM

Breaking News

ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •  

సైబర్ నేర సామ్రాజ్యంపై పోరాటం

10-12-2024 12:00 AM

నటుడు సోనూసూద్ కథానాయకుడిగా నటిస్తూ, రచనాదర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫతే’. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోనాలి సూద్, ఉమేశ్ కేఆర్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2025, జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ విడుదల సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. “ఫతే’ నాకు చాలా ప్రత్యేకం. ఇది దర్శకుడిగా నా అరంగేట్రమే కాదు.. మనలో చాలా మంది తక్కువ అంచనా వేసే సైబర్ ప్రపంచంలోని అదృశ్య, చీకటి శక్తులకు వ్యతిరేకంగా ఇది ఒక వాయిస్. మనలో చాలా మంది చూడని యుద్ధాలను ధైర్యంగా ఎదుర్కొనే హీరోలందరి కోసం ఈ సినిమా చేశాను’ అన్నారు.