సర్దార్ పాపన్నగౌడ్ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
సర్దార్ పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు
ఇబ్రహీంపట్నం, ఆగస్ట్ 18 (విజయక్రాంతి): తన జనం కోసం మొఘల్ చక్రవర్తులను సైతం ఎదురించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకుసాగాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ధైర్యసాహసం, త్యాగాలను గుర్తుచేసుకున్న ఆయన... పాపన్న పోరాటం చరిత్ర మరువదన్నారు.
తెలంగాణ గడ్డ నుంచి మొఘల్ పాలకులపై పోరాడిన పాపన్నగౌడ్ ధీరత్వం ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పిన ఎమ్మెల్యే,ఇందులో భాగంగానే ఆయన విగ్రహాన్ని ట్యాంక్బ్ంప ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కులవృత్తుల పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్న మల్రెడ్డి రంగారెడ్డి.తాటిచెట్లను నరికే వారి పాలిట మరో పాపన్నగౌడ్గా మారాలని పిలుపునిచ్చారు. ఇందుకు తన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజానేత ధర్మభిక్షం విగ్రహాన్ని ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.






